University Fair: మంథన్ పాఠశాలలో యూనివర్సిటీ ఫెయిర్
Sakshi Education
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మంథన్ పాఠశాలలో జనవరి 25న యూనివర్సిటీ ఫెయిర్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 20పైగా దేశాల ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు, కళాశాలల ప్రతినిధులు హా జరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాంటా క్రూజ్ చెందిన యూనివర్సిటీ ప్రతినిధి సమీచ్యా మాట్లాడుతూ యూసీ సిస్టం అనేది ఆవిష్కరణ, సమాజ సేవ, అకాడమిక్ ఎక్సలెన్స్‌కు విలువ ఇస్తుందన్నారు.
చదవండి: Jobs for Unemployed Youth: ఆన్‌లైన్‌లో ఎంప్లాయ్‌మెంట్ సేవలు!
మంథన్ పాఠశాల విద్యార్థులు ఈ లక్షణాలు కలిగి ఉన్నారన్నారు. ఫ్లేమ్ యూనివర్సిటీకి చెందిన సాధన మాట్లాడుతూ మంథన్ విద్యార్థులు ఎంతో చురుగ్గా ఉన్నారని, అనేక ప్రశ్నలు అడుగుతున్నారని అభినందించారు. అనంతరం మంథన్ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రుచిక మాట్లాడారు.
Published date : 26 Jan 2024 02:55PM