Skip to main content

ANU: ఏఎన్‌యూకి టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకు

Times to ANU
Times to ANU

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) కి టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకు లభించింది. లండన్‌కు చెందిన టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ‘ఇంపాక్ట్‌ ర్యాంకింగ్స్‌–2022’ను విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన 17 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఏఎన్‌యూ ప్రపంచస్థాయిలో 601 –800 కేటగిరీలోను, జాతీయస్థాయిలో 23వ ర్యాంకును, రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధిం చినట్లు వర్సిటీ ఆన్‌లైన్‌ ర్యాంకింగ్స్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ నాగకిషోర్‌ను వీసీ ఆచార్య రాజశేఖర్‌ తదితరులు సన్మానించారు.

Also read: Software Jobs: సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయడమే మీ లక్ష్యమా.. ! అయితే మీకోస‌మే ఈ అవ‌కాశం

Published date : 29 Apr 2022 03:28PM

Photo Stories