National Maths Workshop: నేషనల్ మ్యాథ్స్ వర్క్‌షాప్‌నకు ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపిక
రెడ్డిపేట జెడ్పీహెచ్‌ఎస్ గణిత ఉపాధ్యాయుడు డి.మనోహర్, చిన్నమల్లారెడ్డి జెడ్పీహెచ్‌ఎస్ గణిత ఉపాధ్యాయుడు వి.రామకృష్ణ, గోపాల్‌పేట్ జెడ్పీహెచ్‌ఎస్ గణిత ఉపాధ్యాయుడు కె.రాఘవేందర్‌రావు వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. గణితంలో అనుభవ పూర్వక అభ్యసనం అనే అంశంపై శిక్షణ పొందనున్నట్లు వీరు తెలిపారు. వీరిని డీఈవో రాజు, రాష్ట్ర గణిత ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ తాడ్వాయి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, కార్యదర్శి రామారావు, కోశాధికారి నరేందర్ అభినందించారు.
చదవండి: Job Mela: 16 న ఉద్యోగ మేళా
కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం జరిగిన పరీక్షకు 152 మంది విద్యార్థులకుగాను 142 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 163 మందికిగాను 152 మంది విద్యార్థులే పరీక్ష రాశారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలాం తనిఖీ చేశారు.
‘మంచి ఫలితాలు సాధించాలి’
దోమకొండ: విద్యార్థులు వార్షిక పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రాజు సూచించారు. మంగళవారం ఆయన సీతారాంపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పిల్లలకు మోనూ ప్రకారం భోజనం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జీఈసీవో ఉమారాణి, ఎంఈవో ఎల్లయ్య, స్పెషల్ ఆఫీసర్ మమత తదితరులు పాల్గొన్నారు.