సాంకేతిక విద్యా ఫలాలు గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉండాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
దేశంలో 60 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, ఆ ప్రాంతాలూ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ 9న జేఎన్ టీయూహెచ్‌లో జరిగిన భారత విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్ల రెండ్రోజుల సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. ఉపాధి అవకాశాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదని, ప్రైవేటు రంగంతో పాటు స్వయం ఉపాధి అవకాశాల పట్ల కూడా యువత దృష్టి సారించేలా చూడాలని కోరారు. సదస్సులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకట రమణ, జేఎన్ టీయూహెచ్ వీసీ ప్రొ. కట్టా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.