ఆర్జీయూకేటీతో టెక్ జెయింట్ కాగ్నిజెంట్ భాగస్వామ్యం
చిత్రా సు బ్రమణియన్, సీనియర్ డైరెక్టర్, జె.రవికిరణ్, అ సోసియేట్ డైరెక్టర్, సేల్స్‌ఫోర్స్ ఎ.కార్తీక్, మేనేజర్, శివ బవనరి, సీనియర్ మేనేజర్, ఔట్‌రీచ్ బాల ప్రసాద్, సర్వీస్ డెలివరీ మేనేజర్‌తో కూడిన బృందా నికి ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ వి.వెంకటరమణ ఘన స్వాగతం పలికారు.
చదవండి: RGUKT Basara: ‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్
కాగ్నిజెంట్ లీడర్‌షిప్ టీమ్, ఆర్జీయూకేటీ ఫ్యాకల్టీ, విద్యార్థులతో ఇంటరాక్టివ్ సె షన్‌లలో నిమగ్నమై, ఆలోచనలు, జ్ఞాన మార్పిడిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. పరిశ్రమకు సిద్ధంగా ఉన్న లైవ్ ప్రాజెక్టులతోసహా రాబోయే 120 రోజుల్లో ఆర్జీయూకేటీ విద్యార్థులకు ఉచిత సేల్స్‌ఫోర్స్ సాంకేతిక శిక్షణ అందించనున్న ప్రణాళికను వివరించారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ విభాగం అధికారి హరిబాబు, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.