Teachers Tweet to KTR: బడి కూలిపోయేలా ఉంది సార్... కేటీఆర్‌కు జనగామ ఉపాధ్యాయుల ట్వీట్
Sakshi Education
జనగామ జిల్లా కేంద్రంలో సిద్దిపేట రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది.
160 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో తరగతి గదుల పైకప్పు దెబ్బతింది. ఇటీవలి వర్షాలతో గోడలు తడిసి, గదుల్లోకి నీరు వస్తోంది. ఉపాధ్యాయులు దీనిపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘‘జనగామలో బాలికల ఉన్నత పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులతోపాటు వరండా పైకప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. బడి కోసం కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. పాఠశాల తరలింపు, కొత్త భవన నిర్మాణానికి సంబంధించి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
Published date : 02 Sep 2021 06:04PM