Teaching: బోధనకు ‘టీచ్ టూల్’
వివిధ ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన 269 మంది ఉపాధ్యాయులకు ప్రత్తిపాడు మండలంలోని డైట్ కళాశాలతోపాటు తెనాలిలోని మున్సిపల్ హైస్కూల్లో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. తరగతిగదిలో విద్యార్థులను ఆకట్టుకునే విధంగా విద్యాబోధన సాగించడంలో అవసరమైన మెళకువలను అలవర్చడంతోపాటు ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాన్ని పెంపొందించడం ఇందులోని ప్రధాన ఉద్దేశం. వివిధ సబ్జెక్టుల బోధనలో తరగతిగదిలో ఉపాధ్యాయులు వెచ్చిస్తున్న సమయంలో విద్యార్థులు ఎంత వరకు ఆయా అంశాలను సద్వినియోగం చేసుకుంటున్నదీ అనే అంశాలను శిక్షణలో పరిగణిలోకి తీసుకోనున్నారు.
చదవండి: AP DSC Notification 2024: ఈ జిల్లాలో భర్తీ కానున్న 712 ఉపాధ్యాయ పోస్టులు..
తరగతి గదిలో ఉపాధ్యాయులు కేటాయిస్తున్న సమయంలో ప్రతి నిమిషం విద్యార్థుల విద్యాభివృద్ధికే వినియోగించాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో బోధనను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సాల్ట్) ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులో భాగంగా టీచ్ టూల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.