Free Training: ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
Sakshi Education
లక్ష్మణచాంద(నిర్మల్): మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఈడీఐఐ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సంతోష్‌కుమార్ సూచించారు.
ఫిబ్రవరి 21న మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఆక్సెంచర్ ఇంటర్ పినర్షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మండలంలోని మహిళలకు ఆహారం, వ్యవసాయం (ఫుడ్ ప్రాసెసింగ్)పై ఉచిత శిక్షణ తరగతులను ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్ శిరీష్‌తో కలిసి ప్రారంభించారు.
చదవండి: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ట్రైనింగ్ 26 రోజుల పాటు ఇక్కడే ఉంటుందన్నారు. మహిళా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీసీ రవి, దినేష్, ఈడీఐఐ మాస్టర్ ట్రైనర్ అలేఖ్య, ఏపీఎం శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.
Published date : 22 Feb 2024 05:19PM