Supreme Court: విదేశీ వర్సిటీల్లో సీట్ల వివరాలివ్వండి
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు విదేశీ యూనివర్సిటీల్లో చేరడానికి ఎక్కడెక్కడ ఎన్ని సీట్లున్నాయో వివరాలతో ఆఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రుసుముల వివరాలు కూడా ఇవ్వాలని సూచించింది. దేశీయ వర్సిటీల్లో వైద్య విద్య కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలంటూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్ 11న చేపట్టింది.
చదవండి: Supreme Court : ఈడబ్ల్యూఎస్ కోటా చెల్లుతుందిలా.. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో..
ఒక దేశం నుంచి మరో దేశానికి విద్యార్థుల బదిలీ కుదరదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. 15 విదేశీ వర్సిటీల వివరాలున్నా మొబిలిటీ, బదిలీలపై స్పష్టత లేదన్నారు. విచారణ 22కు వాయిదా పడింది.
Published date : 12 Nov 2022 12:26PM