8 నుంచి గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు చెప్పారు.
మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో గ్రంథాలయ కమిటీ సమావేశం మే 2న నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల నిర్వహణకు సంబంధించి 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 2023–24 బడ్జెట్ పద్దులను పరిశీలించి ఆమోదించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మే 8వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాల విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.
గ్రంథాలయాల్లో డిజిటలైజేషన్ తీసుకొస్తాం
ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కథలు చెప్పడం, పుస్తక పఠనం, సమీక్షలు, చిత్ర లేఖనం, పేపర్ ఆర్ట్, థియేటర్ ఆర్ట్స్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను సమ్మర్ క్యాంపులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు.
చదవండి: Libraries: గ్రంథాలయాలకు నూతన శోభ
Published date : 03 May 2023 05:48PM