Education system: ఈ పథకంతో చదువుల దశ మారేనా!
‘దేశ భవిష్యత్తు తరగతిగది లోనే రూపుదిద్దుకుంటుంది’ అంటారు ప్రముఖ విద్యావేత్త డీఎస్ కొఠారి. స్వాతంత్య్రా నంతరం 70వ దశకంలో విద్యా రంగానికి దిశా నిర్దేశం చేయడం కోసం మొట్ట మొద టగా నియమితమైన కమిషన్‌కి కొఠారి నాయకత్వం వహించారు. కేంద్రం జీడీపీలో 6 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వార్షిక బడ్జెట్లో 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని విలువైన సిఫారసు చేసింది ఈ కమిషన్. అయితే ఇప్పటివరకూ ఈ స్థాయిలో విద్యకు నిధులు కేటాయించిన ప్రభుత్వాలు లేనే లేవు. ఇటీవల కేరళ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాలు మాత్రం విద్యారంగానికి మిగతా రాష్ట్రాలకన్నా అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తూ ఉండటం హర్షణీయం. గత మూడేళ్లుగా మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌లకు దీటుగా రూపొందిస్తూ ఉండటం గర్వించదగ్గ విషయం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగం దశ మారుతుందని భావించింది మేధావి వర్గం. కానీ అందుకు భిన్నంగా గత ఏడు సంవత్సరాలుగా విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చింది. అయితే ఇటీవల ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల దశను మార్చే దిశలో ప్రయాణం మొదలు పెట్టింది. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య అధికంగా కలిగిన 9,123 పాఠశాలలను మొదటి దశలో ఎంపిక చేసుకొని, ఈ ఆర్థిక సంవత్సరానికి 3,497.62 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. మిగిలిన అన్ని పాఠశాల లనూ రెండు, మూడు దశల్లో ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసి అభివృద్ధి చేస్తామని ప్రకటించడం హర్షించదగిన పరిణామం.
also read: జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
‘మన ఊరు– మన బడి’ కార్యక్రమంలో మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలన్నింటిలో నిర్ణయించిన 12 ప్రాధాన్యతా అంశాలను పరిశీలించి... ఫీల్డ్ ఇంజ నీర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్‌ల ద్వారా పాఠశాలల అవసరాలను అంచనావేసి బడ్జెట్ నిర్ణయిస్తారు. నిధుల ఖర్చులోనూ పారదర్శకత్వాన్ని ప్రదర్శించేలా చర్యలు తీసుకోవడమూ సంతోషించదగిన పరి ణామం. పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకునే ఆలోచన కలిగిన పూర్వ విద్యార్థులు దాతల ద్వారా విరాళాలు సేకరించాలనీ, వాటి కోసం మరో ప్రత్యేక బ్యాంకు ఖాతాను నిర్వహించాలనీ పాఠశాల యాజ మాన్య కమిటీలకు సూచనలు చేశారు.
Also read: Education Sector: కలలో కూడా ఊహించని మహర్దశ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమం ఆహ్వానించదగినదే అయిన ప్పటికీ కార్యక్రమ మార్గదర్శకాలలో కొన్ని లోపాలు న్నాయి. కేవలం శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో మాత్రమే నూతన భవనాలు మంజూరు చేసే అవకాశం ఉండడం వల్ల చాలా పాఠశాలలకు నూతన భవనాలు మంజూరయ్యే అవకాశం లేకుండా పోతున్నది. అలా కాకుండా ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన సంపూర్ణంగా జరిగేలా మార్గ దర్శకాలను మార్చాలి. కాంట్రాక్టర్ ద్వారా పాఠశాల లకు సరఫరా చేసే వస్తువులు, కొనుగోలు చేసే సరుకుల నాణ్యతను పాఠశాల యాజమాన్యం ధృవీక రించిన తరువాతనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలి. అధునాతనమైన సౌకర్యాలు కలిగిన తర గతి గదుల నిర్మాణం చేపట్టి, పాఠశాల వాతావరణం ఆకర్షణీయంగా ఉండేలా చూడాలి. పరిశుభ్రమైన పరి సరాలతో, ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడేలా సదుపాయాలు కల్పించి బడుల సడుల్లో పెను మార్పులు తీసుకురావాలి. తద్వారా దేశాభి వృద్ధికి అవసరమైన భావిభారత పౌరులను తయారు చేసే ‘జ్ఞాన తెలంగాణ‘ నిర్మాణ దిశగా అడుగులు పడాలి!
వరగంటి అశోక్
వ్యాసకర్త విద్యారంగ విశ్లేషకులు
Also read: Internet: మెరుగైన సైబర్ ప్రపంచ దిశగా!