ఎస్సారార్ అధ్యాపకులకు రాష్ట్రస్థాయి అవార్డులు
Sakshi Education
కరీంనగర్‌సిటీ: ఎస్సారార్ ప్రభుత్వ కళాశాలలో జువాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తోట మహేశ్, ఇంగ్లిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సబ్బని ఓదెలుకుమార్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.
మహేశ్ స్వగ్రామం జగిత్యాల జిల్లా శంకరపల్లి. 13ఏళ్లుగా ఉన్నత విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. 2022లోనూ ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్నారు. ఓదెలు కుమార్ స్వగ్రామం పెద్దపల్లి జిల్లా మల్యాల. 13ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో ఉన్నారు. 25 జాతీయ, అంతర్జాతీయ సెమినా ర్లకు హాజరయ్యారు. 22 ఆర్టికల్స్ రాశారు. ఇప్పటివరకు ఐదు జాతీయ అవార్డులు పొందారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.రామకృష్ణ, డాక్టర్ కె.సురేందర్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, డాక్టర్ ఏ.శ్రీనివాస్, హిమబిందు, పి.రాజు, సురేష్, తిరుపతి అభినందించారు.
చదవండి:
National Education Policy: సరిహద్దులు దాటి ముందుకు సాగుతున్న విద్య!
Published date : 04 Sep 2023 01:28PM