Degree Courses: ‘ఎస్‌ఆర్‌ఆర్’లో డిగ్రీ ఆనర్స్ కోర్సులు
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి మూడు డిగ్రీ ఆనర్స్, ఐదు రీసెర్చితో డిగ్రీ ఆనర్స్‌కోర్సులు ప్రారంభిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సంవత్సరాలు డిగ్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఆనర్స్ కోర్సుల్లో నాలుగో సంవత్సరం ప్రవేశాలకు కాలేజియేట్ ఎడ్యుకేషన్ అనుమతి ఇచ్చినట్లు వివరించారు. ఆనర్స్ బీఎస్సీ కంప్యూటర్స్ సైన్సు, బీఏ హిస్టరీ, బీఏ అర్థశాస్త్రం విభాగాలు ఉన్నాయని తెలిపారు. రీసెర్చితో డిగ్రీ ఆనర్స్ చేయడానికి బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ మ్యాథ్స్, బీకాం జనరల్, బీఏ స్పెషల్ తెలుగు, బీఏ ఇంగ్లీషు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని పేర్కొన్నారు.
చదవండి: Degree Admissions: డిగ్రీలో ప్రవేశాలకు స్పెషల్ డ్రైవ్