Skip to main content

అంధ విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలు.. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ఒప్పందాలపై సీరియస్..

అంధ విద్యార్థుల అభ్యాసనానికి వీలుగా అవసరమైన వనరులను సిద్ధం చేయాలని అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలను యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ (యూజీసీ) ఆదేశించింది.
Special text books for blind students
అంధ విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలు.. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ఒప్పందాలపై సీరియస్..

ఈ మేరకు జనవరి 23న ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రెయిలీ ప్రింట్, లార్జ్‌ ప్రింట్, టాక్‌టైల్, ఆడియో పుస్తకాలు వంటివి సిద్ధం చేసి.. అంధ విద్యార్థులు సులభంగా చదువుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఆ ఒప్పందాలపై సీరియస్‌

ఆన్ లైన్ ఎడ్యుకేషన్ పేరుతో ఎడ్‌టెక్‌ కంపెనీలతో పలు ఉన్నత విద్యాసంస్థలు ఒప్పందాలు చేసుకోవడంపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ (యూజీసీ) తీవ్రంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా ఏ ఉన్నత విద్యాసంస్థ అయినా ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటే.. వాటి గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇటీవల పలు ఉన్నత విద్యాసంస్థలకు వివిధ కోర్సులను అందిస్తున్నట్లు కొన్ని ఎడ్‌టెక్‌ కంపెనీలు, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలివ్వడంతో యూజీసీ ఆయా సంస్థలకు రెడ్‌ లెటర్‌ నోటీసులిచ్చింది.

చదవండి: 

TVCC: ఉచితంగా అంధ విద్యార్థులకు పుస్తకాలు

మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్

Rajesh Singh, IAS: చూపులేని వ్యక్తి...విధికే సవాలు విసిరి..గెలిచాడిలా..

Published date : 24 Jan 2022 01:52PM

Photo Stories