Skip to main content

మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్

దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్‌గా ప్రంజల్ పాటిల్ నియమితులయ్యారు.
కేరళలోని తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్‌గా అక్టోబర్ 14న ఆమె బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన ప్రంజల్ ఆరేళ్ల వయసులోనే చూపును కోల్పోయారు. ముంబైలోని కమలామెహతా దాదర్ అంధుల పాఠశాలలో చదువుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్‌‌సలో డిగ్రీపట్టా పొందారు. తర్వాత ఢిల్లీ జేఎన్‌యు నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్‌‌సలో పీజీ పూర్తి చేశారు. 2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమెకు భారత రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్‌ఏఎస్)లో ఉద్యోగం వచ్చింది. అయితే ప్రంజల్ అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు. పట్టు వదలని ప్రంజల్ తర్వాతి యేడు జరిగిన యూపీఎస్సీ పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమె ఐఏఎస్‌గా ఎంపికై , యేడాది శిక్షణలో భాగంగా ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు.
Published date : 15 Oct 2019 06:31PM

Photo Stories