Skip to main content

Zero Balance Acount: విద్యార్థుల కోసం స్పెషల్ అకౌంట్ - ప్రయోజనాలు ఇవే..

హైదరాబాద్‌: విద్యార్థుల కోసం సున్నా బ్యాలన్స్‌ సదుపాయంతో ప్రత్యేక సేవింగ్స్‌ ఖాతాను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) ప్రారంభించింది.
Special Account for Students

16–25 ఏళ్ల వయసులోని విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘బీవోబీ బ్రో సేవింగ్స్‌ ఖాతా’ను రూపొందించినట్టు తెలిపింది. జీవిత కాలం పాటు కాంప్లిమెంటరీ డెబిట్‌ కార్డ్, ఇతర ప్రయోజనాలను ఈ ఖాతాకు అనుసంధానంగా ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

చదవండి: Student Loans: విదేశాల్లో ఉన్నత విద్యకు రుణాలు... 83 శాతం ప్రభుత్వ బ్యాంకుల నుంచే!

ప్రయోజనాలు.. 

16–25 ఏళ్ల వయసు వారికి ఈ ఖాతా సున్నా బ్యాలన్స్‌తో వస్తుంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన ఉచిత రపే ప్లాటినం డెబిట్‌ కార్డ్‌ సొంతం చేసుకోవచ్చు.

ప్రతి త్రైవసికానికీ విమానాశ్రయాల్లో రెండు సార్లు లాంజ్‌ ప్రవేశాలను పొందొచ్చు. ర.2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉచితం. ఆటో స్వీప్‌ సదుపాయం కూడా ఉంది. నెఫ్ట్, ఆర్ట్‌జీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ లావాదేవీలు ఉచితం. 

చెక్‌లను కూడా ఉచితంగా పొందొచ్చు. ఉచిత ఎస్‌ఎంఎస్, ఈమెయిల్‌ అలర్ట్‌ల సదుపాయం కూడా ఉంది. డీమ్యాట్‌ ఖాతా ఏఎంసీపై నూరు శాతం రాయితీ ఉంది.

విద్యా రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్‌ చార్జీ లేకపోగా, వడ్డీ రేటులో 0.15 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఖాతాను యువతకు చేరువ చేసేందుకు గాను ఐఐటీ బోంబేకి చెందిన మూడ్‌ ఇండిగోను ఎక్స్‌క్లూజివ్‌ బ్యాంకింగ్‌ పార్ట్‌నర్‌గా నియమించుకుంది.

sakshi education whatsapp channel image link

Published date : 19 Dec 2023 02:59PM

Photo Stories