Skills University: దసరా నుంచి స్కిల్స్ వర్సిటీ షురూ
స్కిల్స్ యూనివర్సిటీలో 20 కోర్సులను నిర్వహించనున్నామని.. అందులో దసరా నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సు లను ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితరాలపై ఆగస్టు 18న ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో స్కిల్స్ వర్సిటీ భవనాల నిర్మాణం పూర్తయ్యేదాకా.. తాత్కాలిక భవనంలో వర్సిటీని నిర్వ హించనున్నట్టు తెలిపారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా/ న్యాక్/ నిథమ్ భవనాల్లో తరగతులు నిర్వహిస్తామన్నారు.
వర్సిటీ చైర్‌పర్సన్‌గా ఆనంద్ మహీంద్రా, కో–చైర్మన్‌గా శ్రీనివాస సి రాజును నియమించినట్టు వెల్లడించారు. స్కిల్స్ యూనివర్సిటీలో 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
చదవండి: Free Skill Training : మొగల్‌రాజపురం ఐటీఐలో ఉచిత నైపుణ్య శిక్షణ
తొలుత స్కూల్ ఆఫ్ ఈ–కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులను ప్రారంభిస్తున్నామన్నారు. వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన ఎస్‌బీఐ, న్యాక్, డాక్టర్ రెడ్డీస్, టీవీఏజీఏ, అదానీ కంపెనీలు భాగస్వాములుగా ఉండేందుకు అంగీకరించాయన్నారు.
సీఐఐ కూడా ముందుకు వచ్చిందని చెప్పారు. యూనివర్సిటీ లోగో, వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.