Skip to main content

Sharada Vidyalaya: శతాబ్ది వేడుకలు ప్రారంభం

హైదరాబాద్‌, 29 నవంబర్‌ 2022: కెజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తున్న శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు నేడు ప్రారంభమమ్యాయి.
Sharada Vidyalaya
శారదా విద్యాలయ శతాబ్ది వేడుకలు ప్రారంభం

ఈ ఉత్సవాలను తెలంగాణా రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి వి కరుణ, ఐఏఎస్‌, సైబరాబాద్‌ పొలీస్‌ కమిషనర్‌ శ్రీ స్టీఫెన్‌ రవీంద్ర, ఐపీఎస్‌, వర్ట్యుసా హైదరాబాద్‌ ఫెసిలిటీ హెడ్‌ శ్రీ కృష్ణ ఎదుల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్‌ ల్యాబ్స్‌ ఛైర్మన్‌ శ్రీ జయంత్‌ ఠాగోర్‌, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్‌ మాదిరెడ్డి, కరస్పాండెంట్‌ జ్యోత్స్న అంగారా సైతం పాల్గొన్నారు.

చదవండి: పుస్తకాలన్నీ సిద్ధం.. ప్రైవేట్‌ స్కూళ్లకు కూడా..
నిరుపేద విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో శారదా విద్యాలయ గ్రూప్‌ను 1922లో శ్రీ వై సత్యనారాయణ ఏర్పాటుచేశారు. ఈ విద్యాలయను అప్పటి హైదరాబాద్‌ నిజాం ప్రధానమంత్రితో పాటుగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. అత్యంత పురాతనమైన, లాభాపేక్షలేని విద్యాలయంగా ఖ్యాతి గడించిన శారదా విద్యాలయలో కెజీ నుంచి పీజీ వరకూ విద్యాబోధన సాగుతుంది .దాదాపు 1450 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత బాలికల కోసమే దీనిని ప్రారంభించినా అనంతర కాలంలో బాలురకీ ఇక్కడ విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాసంస్థలో 62% మంది బాలికలు ఉన్నారు. నిరుపేద చిన్నారులకు విద్యనందించడంలో అందిస్తున్న తోడ్పాటుకుగానూ 2018లో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణా అవార్డునూ అందుకుంది.

చదవండి: Education: ఈ రాష్ట్రంలో తగ్గిపోతున్న పాఠశాల విద్య నాణ్యత
అవిశ్రాంతంగా వందేళ్లగా మెరుగైన విద్యాబోధనను పాతబస్తీ విద్యార్థులకు చేస్తోన్న శారదా విద్యాలయ విప్లవాత్మక ఆవిష్కరణలనూ మెరుగైన విద్య కోసం చేసింది. డిజిటల్‌ తరగతులను నాల్గవ తరగతి లోపు విద్యార్ధులకు తీసుకురావడంతో పాటుగా 1.36 ఎకరాల విస్తీర్ణంలో ఆటస్థలాన్నీ విద్యార్ధులకు అందుబాటులో ఉంచి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కూ అమిత ప్రాధాన్యత అందిస్తుంది.

చదవండి: UDISE Plus: ఈ ఏడాదిలో ఇన్ని వేల స్కూళ్లు మూసివేత
తమ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా చేయడానికి శారదా విద్యాలయ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల ప్రారంభోత్సవంలో భాగంగా వందేళ్ల విద్యాలయ ప్రస్ధానంలో కీలకమైలురాళ్లతో ఓ ఫోటో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఈ గ్యాలరీని ముఖ్యఅతిథి శ్రీమతి వి కరుణ ప్రారంభించారు. దీనితో పాటుగా ఏర్పాటుచేసిన పలు స్టాల్స్‌నూ ఆమె సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలను విద్యార్థులు ప్రదర్శించారు.

Published date : 29 Nov 2022 05:25PM

Photo Stories