Skip to main content

Degree College: షాద్‌నగర్‌ డిగ్రీ కళాశాలకు న్యాక్‌ గుర్తింపు

షాద్‌నగర్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) గుర్తింపు లభించింది.
Shadnagar Degree College is recognized by NAAC Assessment of Educational Facilities    Shadnagar Degree College NAAC Visit

గత నెల 30, 31 తేదీల్లో న్యాక్‌ బృందం కళాశాలను సందర్శించింది. కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు, కళాశాల నిర్వహణ తదితర అంశాలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులతో సమావేశమై వివరాలు సేకరించారు.

చదవండి: Beauty Training: బ్యూటీషన్‌పై శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

కళాశాలలోని కంప్యూటర్‌ ల్యాబ్‌, ప్రయోగశాలలు, గ్రంథాలయం, తాగునీటి ప్లాంట్‌ను పరిశీలించారు. వారి నివేదిక ఆధారంగా కళాశాలకు బీ ప్లస్‌ గ్రేడ్‌ లభించింది. దీంతో కళాశాలలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కానున్నాయి. కళాశాలకు న్యాక్‌ గుర్తింపు రావడంపై కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కమల, వైస్‌ ప్రిన్సిపాల్‌ భాను ప్రకాష్‌ హర్షం వ్యక్తం చేశారు.

Published date : 09 Feb 2024 01:27PM

Photo Stories