పారామెడికల్ కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్ తేదీ ఇదే..
Sakshi Education
కర్నూలు(హాస్పిటల్): పారామెడికల్ కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 10న నిర్వహించనున్నట్లు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సెప్టెంబర్ 8న ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10 గంటలకు కళాశాలలోని ఆడిటోరియంలో కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందన్నారు. వివిధ కోర్సుల్లో మిగిలిన డీఎంఎల్‌టీ–14, డీఏఎన్‌ఎస్–5, డీఎంఐటీ–4, డీఆర్‌జీఏ–3, డీవోఏ–2, డి.డయాలసిస్–6, డి. డార్క్‌రూమ్ అసిస్టెంట్–6, ఈసీజీ–3, క్యాథలాబ్–3, డి. కార్డియాలజి టెక్నీషియన్ –3 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని.. ఈ సీట్లను మెరిట్, రోస్టర్ ఆధారంగా భర్తీ చేస్తామన్నారు.
Published date : 10 Sep 2024 08:33AM