Skip to main content

విద్యార్థులకు సైన్స్‌ సెమినార్‌

కందనూలు: విద్యార్థుల్లో సమాచార సేకరణ నైపుణ్యం పెంపొందించేందుకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 8వ, 9వ, 10వ తరగతి విద్యార్థులకు సైన్స్‌ సెమినార్‌ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి గోవిందరాజులు సెప్టెంబ‌ర్ 3న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Science seminar for students
విద్యార్థులకు సైన్స్‌ సెమినార్‌

సెమినార్‌లో ‘చిరుధాన్యాలు ఒక ఉత్తమమైన ఆహారమా లేదా అది ఒక ఆహార వ్యామోహమా’ అంశంతో పాటు, విద్యార్థుల్లో శాసీ్త్రయ విశ్లేషణాత్మక ఆలోచనలు పెంపొందించేందుకు, వర్థమాన శాస్త్రవేత్తలు తమ ఆలోచనలు పంచుకోవడం కోసం ఒక వేదికను కల్పించడం, దేశంలోని అన్ని ప్రాంతాల్లోని బాలమేధావుల్లో జాతీయ సమైక్యత భావాలు నూరిపోయడం లక్ష్యాలను సెమినార్‌లో వివరించాలన్నారు. విద్యార్థులు సెమినార్‌ అంశాన్ని వివరించడానికి చార్టులు, నమూనాలు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వినియోగించుకోవచ్చన్నారు.

చదవండి: Aditya-L1 successfully boost first orbital: ఆదిత్య–ఎల్‌1 మొదటి కక్ష్య పెంపు విజయవంతం

సెమినార్‌ అంశాన్ని ఆరు నిమిషాల వ్యవధిలో వివరించాలని తెలియజేశారు. రెండు నిమిషాలు జడ్జిలు అడిగిన ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొన్నారు. సైన్స్‌ ఉపాధ్యాయులు సెమినార్‌ అంశంలో విద్యార్థులకు సహకారం అందించాలని సూచించారు. సెప్టెంబ‌ర్ 8న మండల స్థాయి పోటీలు, మండల వనరుల కేంద్రాల్లో, 12న జెడ్పీ హైస్కూల్‌లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తారని చెప్పారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి కృష్ణారెడ్డి 9989921105ని సంప్రదించాలని సూచించారు.

చదవండి: National Science Seminar – 2023: జాతీయ సైన్స్‌ సెమినార్‌ పోటీలకు ఆహ్వానం

Published date : 04 Sep 2023 03:05PM

Photo Stories