Schools & Colleges Closed: భారీ వర్షం.. స్కూల్స్, కాలేజీలు బంద్
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు, ఐదు తాలుకాలను వర్షం ముంచెత్తడంతో స్కూల్స్, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
చదవండి: School Holidays: కార్తీక పౌర్ణమి సందర్బంగా పాఠశాలలకు సెలవు.. కార్తీక పౌర్ణమి ప్రత్యేకతలేంటి..
వివరాల ప్రకారం.. తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్, మధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో కుండపోత వాన కురుస్తోంది. ఇక, నీల్‌గిరి జిల్లాలోని ఐదు తాలుకాలను వర్షం ముంచెత్తింది. ఈ క్రమంలో ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
చదవండి: School Holidays: నవంబర్ 27న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..
ఇదిలా ఉండగా.. రాబోయే 24 గంటల్లో తమిళనాడు, కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గత కొద్ది రోజుల నుంచి కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం కన్నూరు జిల్లాలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కేరళలో కూడా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.