Samskar Training Program: విద్యార్థులకు ‘Sanskar’ శిక్షణ కార్యక్రమం
ఈ కార్యక్రమంలో భాగంగా రాజానగరం, ఎస్.నర్సాపురం, పెదరాంభద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు 35 రోజుల పాటు రోజుకు 2 గంటల పాటు సుశిక్షులతో భారతదేశ సంస్కృతి, నాగరికత, సంప్రదాయాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శిక్షణ ఇస్తారన్నారు. అనంతరం పాయకరావుపేట మండలంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సుమారు 800 మంది ఎస్‌ఎస్‌సి విద్యార్థులకు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం ముద్రించిన, డెక్కన్ ఫైన్ కెమికల్స్ యాజమాన్యం సమకూర్చిన రూ.1.60 లక్షల విలువైన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. 10వ తరగతి విద్యార్థులు వీటిని ఉపయోగించుకుని మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
చదవండి: VC Acharya K. Padmaraju: నూతన విద్యావిధానం అమల్లో మనమే ప్రథమం
కార్యక్రమంలో డెక్కన్ ప్రతినిధులు పి.వి.ఎస్.ఎస్ రాజు, ఎన్.సూర్యానారాయణ రాజు, బి.వెంకటపతిరాజు, రామరాజు ఫౌండేషన్ వ్యవస్ధాపకుడు సిఏ రామరాజు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం.ఝూన్సీ, కోడి శ్రీనివాసరావు, షేక్ రాం రహీం, రామరాజు ఫౌండేషన్ ప్రతినిధులు అప్పలనాయుడు, ధనుంజయ్, మోహన్‌రావు పాల్గొన్నారు.