VC Acharya K. Padmaraju: నూతన విద్యావిధానం అమల్లో మనమే ప్రథమం
యూనివర్సిటీలో బుధవారం ‘సోషల్ ఇంజినీరింగ్ యాక్సెస్ అండ్ ఇన్ల్కూజన్’, ‘యువసాధికాతర – ఉపాధి’ అనే అంశాలపై వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కరిక్యులమ్‌లో 30 శాతం స్కిల్ ప్రోగ్రామ్స్ ఉండటంతో పాటు ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతోందన్నారు. ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు చదువుకునే సమయంలోనే ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై త్వరలో యూనివర్సిటీలో శిక్షణ ఇస్తామన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ‘యువ సాధికారత – ఉపాధి’ అనే అంశంపై బెంగళూరుకు చెందిన జేవీఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్ ప్రైన్యూర్‌షిప్ ప్రొఫెసర్ ఎన్‌ఎంకే భట్ట ఉపన్యసించారు. రాష్ట్రంలో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. ‘సోషల్ ఇంజినీరింగ్ యాక్సెస్ అండ్ ఇన్ల్కూజన్’ అనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ లోకానందరెడ్డి ఐరాల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించిన ప్రగతిని వివరించారు. ఆచార్య కేఎస్ రమేష్ కన్వీనర్‌గా, డాక్టర్ పి.ఉమామహేశ్వరిదేవి కో కన్వీనర్‌గా వ్యవహరించిన వర్క్‌షా్‌ప్‌లో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Tags
- New education system
- Andhra Pradesh
- Adikavi Nannaya University
- VC Acharya K Padmaraju
- Social Engineering Access and Inclusion
- Non Youth Development Employment
- internships
- Skill programs
- Skill Development
- artificial intelligence
- University of Hyderabad School
- Management Studies
- Education News
- andhra pradesh news