రెగ్యులర్ పీహెచ్‌డీ నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో పీహెచ్‌డీ కేటగిరీ–2లో ప్రవేశాలకు జరిగే ఎంట్రన్స్ టెస్ట్–2022కు ఆగస్టు 1న అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
పీజీ కోర్సులు పూర్తి చేసిన అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, ఆగస్టు 24 వరకు రూ.1,000 అపరాధ రుసు ముతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ పాండురంగారెడ్డి వెల్లడించారు. సీట్లు లేనందున ఎంబీఏ, ఫార్మసీ కోర్సులకు దరఖాస్తులు స్వీకరించడం లేదన్నారు. ఎంట్రన్స్‌లో వచ్చిన మార్కులతో పాటు ఇంటర్వ్యూల ఆధారంగా ప్రవేశాలను కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఎంట్రన్స్ పరీక్షలను సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు www.osmania.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
చదవండి:
Published date : 03 Aug 2022 11:40AM