Degree: అడ్మిషన్ల షెడ్యూల్ ఇలా..
ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, కాలేజీలతోపాటు అటానమస్ కాలేజీల్లోని హా నర్స్ డిగ్రీ కోర్సులు, ఇతర డిగ్రీ కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. ఆన్‌లైన్ అడ్మిషన్స్ మా డ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) ద్వారా ప్రవేశాలను చేపట్టనున్నారు. ఇక దివ్యాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ తదితర విభాగాలకు సంబందించిన స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్‌ను విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ, విశాఖపట్నం డా. వీఎస్ కృష్ణా కాలేజీ, తిరుపతి ఎస్వీ వర్సిటీలో నిర్వహిస్తారు.
చదవండి: డిగ్రీలో ఇంత శాతం వచ్చినా టెట్‌కు అర్హులే
షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ |
జూలై 22 |
రిజిస్ట్రేషన్లు |
జూలై 23 నుంచి 31వరకు |
సర్టిఫికెట్ల పరిశీలన ఆన్‌లైన్‌లో, హెచ్‌ఎల్‌సీల్లో |
ఆగస్టు 1 నుంచి 5 వరకు |
స్పెషల్ కేటగిరీ పరిశీలన |
ఆగస్టు 3, 4 తేదీల్లో |
వెబ్ ఆప్షన్లు |
ఆగస్టు 8 నుంచి 12 వరకు |
వెబ్ ఆప్షన్ల సవరణ |
ఆగస్టు 13 నుంచి 15 |
సీట్ల కేటాయింపు |
ఆగస్టు 22 నుంచి 24 |
తరగతుల ప్రారంభం |
ఆగస్టు 25 |