Skip to main content

TPTF: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

దేవరుప్పుల : ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ వివక్ష తగదని తెలంగాణ ప్రొగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఆకుల లక్ష్మయ్య విమర్శించారు.
TPTF
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

 మండల కేంద్రంతోపాటు వివిధ పాఠశాలల్లో ఆగ‌స్టు 24న‌ నిర్వహించిన టీపీటీఎఫ్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖలో పదోన్నతులు, బదిలీలు చేపట్టకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుయుక్తులను అధిగమించేందుకు న్యాయపరమైన హక్కుల సాధనకు ఉపాధ్యాయ సంఘాలు ఐక్యసంఘటన కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

చదవండి: Teacher Jobs: టీచర్‌ పోస్టులు గల్లంతు..!

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలు భర్తీ చేసి పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్‌జీ, జోగు వరప్రసాద్‌, రాజేందర్‌కుమార్‌, వీరారెడ్డి, శ్రీనివాస్‌, తిరుపతిరెడ్డి, నవీన్‌ కుమార్‌, రాజేందర్‌ పాల్గొన్నారు.

చదవండి: Collector Ravi Pattanshetty: విద్యార్థిగా మారి.. పాఠాలు విని

Published date : 25 Aug 2023 01:33PM

Photo Stories