Pre PhD: పరీక్షా ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 2023 ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంఫిల్ పార్ట్–1, ప్రీ పీహెచ్‌డీ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 24న వీసీ ఆచార్య పి.రాజశేఖర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించిన కొద్ది రోజులలోనే ఫలితాలు విడుదల చేయడం అభినందనీయమన్నారు. రీసెర్చ్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ పరీక్షలకు హాజరైన పరిశోధకులలో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
చదవండి: ANU: కళాకారుడికి అరుదైన ఆహ్వానం
రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి మే 6 ఆఖరు తేదీగా నిర్ణయించామని, రీవాల్యుయేషన్ ఫీజు ఒక్కో స్క్రిప్ట్‌కు రూ.1400 చొప్పున చెల్లించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జి.అనిత, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఇ..శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
చదవండి: Light Pollution: కృత్రిమ ఉపగ్రహ కాంతితో భూమికి ముప్పు.. పరిష్కారం ఏమిటి?
Published date : 25 Apr 2023 04:03PM