ANU: కళాకారుడికి అరుదైన ఆహ్వానం
Sakshi Education
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కళాకారుడు, ఫైన్‌ఆర్ట్స్ అధ్యాపకుడు పి.శ్రీనివాస్‌కు అరుదైన ఆహ్వానం లభించింది. ఏప్రిల్ 27వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్రమోదీలను కలిసే అవకాశం లభించింది.
ప్రధాన మంత్రి నిర్వహిస్తున్న మన్‌కీ బాత్‌ను ప్రసారం చేస్తున్న డీడీ(దూరదర్శన్) సంస్థ ఏప్రిల్ 26వ తేదీన మన్‌కీ బాత్ 100 ఎపిసోడ్ల సమావేశం నిర్వహించనుంది. ఈ ఎపిసోడ్‌లో పాల్గొనాల్సిందిగా ఏఎన్‌యూ అధ్యాపకుడు శ్రీనివాస్‌కు డీడీ ఆహ్వానం పంపింది.
చదవండి: Mann Ki Baat: ‘అంతరిక్షం’లో నూతన సూర్యోదయం.. మన్‌కీ బాత్‌లో మోదీ
పాత ఇనుప వ్యర్థాలతో కళాకృతులు తయారు చేసే కళాకారుడు శ్రీనివాస్ నైపుణ్యాన్ని 2021వ సంవత్సరం మార్చి 27వ తేదీన ప్రసారమైన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. కాగా, శ్రీనివాస్‌ను ఏప్రిల్ 17న వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజి్రస్టార్ ఆచార్య బి.కరుణ ప్రత్యేకంగా అభినందించారు.
Published date : 18 Apr 2023 03:18PM