మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైన తేదీ?
Sakshi Education
ప్రతీ నెల చివరి ఆదివారం జరిగే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.
మన్ కీ బాత్ కార్యక్రమం 2021, మార్చి 28నాటికి 75 భాగాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు శ్రోతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్–19పై భారత్ స్ఫూర్తిదాయక పోరాటం చేస్తోందన్నారు. అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మన్ కీ బాత్...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ నెల చివరి ఆదివారం నిర్వహించే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్(మనసులో మాట) 2014, అక్టోబర్ 3న ప్రారంభమైంది. 2021, మార్చి 28 నాటికి 75 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఆలిండియా రేడియో ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
‘ఎల్జీ’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం...
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కి ప్రజా ప్రభుత్వం కన్నా ఎక్కువ అధికారాలు కల్పించే ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్‌మెంట్) బిల్, 2021’కి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్ని మార్చి 28న కేంద్రం ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది.

Published date : 30 Mar 2021 03:10PM