Skip to main content

Degree Exams: కేయూ డిగ్రీ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో న‌వంబ‌ర్ 13న నిర్వహించాల్సిన డిగ్రీ బ్యాక్‌లాగ్‌ పరీక్షల్ని వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి న‌వంబ‌ర్ 10న‌ తెలిపారు.
 KU Degree Backlog Exams Postponed, Degree Backlog Exams Postponed,  Postponement of KU degree backlog exams, KU Campus Announcement,

న‌వంబ‌ర్ 13న దీపావళి సెలవుదినంగా ప్రకటించిన సందర్భంగా అదే రోజున జరగాల్సిన ఆయా పరీక్షలను వాయిదా వేసినట్లు, మళ్లీ న‌వంబ‌ర్ 15న నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాల్ని సంబంధిత కేయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలన్నారు.

చదవండి: UGC Fellowships 2023: విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, ఫెలోషిప్‌ సాయం పెంపు... ఎంతంటే..

కేయూ పరిధి బీఫార్మసీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు కూడా న‌వంబ‌ర్ 13న జరగాల్సినవి వాయిదా వేశామని అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక తెలిపారు. మళ్లీ ఆయా పరీక్షలు ఈనెల 15న నిర్వహించనున్న ట్లు తెలిపారు. కాగా.. న‌వంబ‌ర్ 13న దీపావళి సెలవుదినంగా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.

Published date : 11 Nov 2023 01:44PM

Photo Stories