Admissions: పీహెచ్‌డీ ప్రవేశాలు పారదర్శకం
పీహెచ్‌డీ రెండో కేటగిరీలో అడ్మిషన్లు నిష్పక్షపాతంగా చేశామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే విజ్ఞాపన పత్రంతో డీన్లకు సమర్పించాలన్నారు. ఎక్కడైనా తప్పుదొర్లితే ఆ తప్పును సవరించేందుకు డీన్ల వద్ద ఉన్న సమాచారాన్ని పున:పరిశీలించి పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. పీహెచ్‌డీ రెండో కేటగిరీ అడ్మిషన్లపై కొద్దిరోజులుగా కొంతమంది సీటు రాని విద్యార్థి నాయకులు ఆందోళనలు చేయడం, అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, డీన్ పదవికి రాజీనామ చేయాలని ఫోన్ల ద్వారా అధికారులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు.
యూనివర్సిటీ ఆస్తులు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. విద్యార్థి నాయకుల చేష్టలను ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యావాతావరణాన్ని దెబ్బతీస్తున్న వారికి మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు.
చదవండి: Kakatiya University: పీహెచ్‌డీ సీట్లు పెంచాలని ఆందోళన