Central University Admissions: కేంద్రీయ వర్సిటీలో అడ్మిషన్లు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు జూన్ 18లోపు దరఖాస్తులు చేసుకోవాలని వీసీ ప్రొఫెసర్ తేజస్వి.వి.కట్టమణి తెలిపారు.
ఎంఎస్‌సీ కెమిస్ట్రీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మిని ్రస్టేషన్(ఎంబీఏ), ఎంఏ సోషియాలజీ, మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ ట్రైబల్ స్టడీస్, ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతి కోర్సులో 20 సీట్లుంటాయని, జాతీయ రిజర్వేషన్ విధానంలో సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. https://cuet.nta.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పీంచవచ్చన్నారు.
Published date : 24 May 2022 01:34PM