DRDO Chairman: ఎందరో ప్రముఖులను అందించిన విశ్వవిద్యాలయం
అక్టోబర్ 27న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉస్మానియా యూనివర్సిటీ వెలుగులు విరజిమ్ముతోందని కీర్తించారు. వైఎస్ జగన్, కేసీఆర్ తో విశ్వవిద్యాలయానికున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. జాతీయ, అంతర్జాతీయ రంగానికెదిగిన ప్రముఖులను ప్రస్తావించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీరెడ్డి, పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఐహెచ్ లతీఫ్, క్రీడాకారిణి సానియా మీర్జా అనేక మంది వర్సిటీ పూర్వ విద్యార్థులే అన్నారు. దేశం గగన్ యాన్ మిషన్ కు సన్నద్ధమవుతున్న వేళ, అంతరిక్షంలో మొదటి భారతీయుడు, వింగ్ కమాండర్ రాకేష్ శర్మ సైతం పూర్వ విద్యార్థి కావడం గర్వకారణమన్నారు.
పరిశోధనల కేంద్రం
దేశ ఆయుధగారంలో ప్రధాన క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ఉస్మానియా యూనివర్సిటీ లేబొరేటరీలతో కలసి నిర్వహించడం గర్వించదగ్గ పరిణామమని సతీశ్రెడ్డి పేర్కొన్నారు. ఐసీబీఎం సామర్థ్యంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో, నీటి అడుగున క్షిపణి ప్రయోగ సామర్థ్యంలో ఐదో స్థానంలో, స్వదేశీ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయడంలో ఏడో స్థానంలో ఉందని చెప్పారు.
చదవండి:
Jobs: నియామకాలకు ఆర్టీసీ శ్రీకారం