Open School Results: ఓపెన్ స్కూల్ ఫలితాలు వెల్లడి
Sakshi Education
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ) జూన్/ జూలైలో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియె ట్ సప్లిమెంటరీ ఫలితాలు జూలై 27న వెలువడ్డా యి.
జూన్ 26 నుంచి జూలై 4 వరకు ఈ పరీక్షలు జరిగాయి. టెన్త్ ఫలితాల్లో 620 మందికి 359 (57.90 శాతం) మంది, ఇంటర్‌లో 965 మందికి 443 (45.91 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఆగస్ట్ 4 వరకు ఏపీ ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఇన్‌చార్జి డీఈవో ఎం.జ్యోతికుమారి తెలిపారు. పరీక్ష ఫలితాలు, మార్కుల మెమోల కోసం ఏపీఓపెన్‌స్కూల్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్‌పోర్టల్‌ను సంప్ర దించాలని ఆమె సూచించారు.
Published date : 28 Jul 2023 04:22PM