Study Abroad: విదేశీ విద్యపై ఓపెన్ డోర్స్ సంస్థ నివేదిక
2021–22లో అమెరికాలో 9.48 లక్షల మంది విదేశీ విద్యార్థులు ప్రవేశాలు పొందగా వారిలో 21 శాతం (1,99,182 మంది) భారతీయులే! 2020–21తో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువని ఓపెన్ డోర్స్ సంస్థ నివేదిక వెల్లడించింది.
మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్
కరోనా వల్ల 2020–21లో అమెరికాలో అడ్మిషన్లు తీసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 13.2 శాతం తగ్గింది. వైరస్ ప్రభావం తగ్గడంతో 2021–22లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. భారతీయ విద్యార్థుల సంఖ్య 18.9 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో చైనాదే అగ్రస్థానం. కానీ వారి సంఖ్య 2020–21లో 3.17 లక్షలుండగా 2021–22లో 2.9 లక్షలకు తగ్గింది.
చదవండి: Communication skills: అంతర్జాతీయ అవకాశాలకు.. ఇంగ్లిష్! భాషపై పట్టు సాధించేందుకు మార్గాలు..
అమెరికాలో 9,48,519 మంది విదేశీ విద్యార్థులున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 21.1 శాతం (2 లక్షలు) మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, 19.8 శాతం (1.88 లక్షలు) ఇంజనీరింగ్ చదువుతున్నారు. వచ్చే వేసవిలో భారత విద్యార్థులకు 82 వేలకు పైగా వీసాలు జారీ చేస్తామని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. గతేడాది 62 వేల వీసాలు జారీ చేసినట్లు ‘మినిస్టర్ కౌన్సెలర్ ఫర్ పబ్లిక్ డిప్లొమసీ’ గ్లోరియా బెర్బెనా తెలిపారు.
చదవండి: Scholarships: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో ప్రయోజనాలు..