Skip to main content

Online Education: గ్రామాలకు చేరని ఆన్ లైన్ విద్య

ఆన్ లైన్ విద్య పల్లెల వరకు చేరనట్టు కనిపిస్తోంది. గ్రామీణ విద్యార్థులు ఇంటర్నెట్‌ వేగాన్ని అందుకోనట్టు తెలుస్తోంది.
Online Education
గ్రామాలకు చేరని ఆన్ లైన్ విద్య

ఆన్ లైన్ చదువుకు కావాల్సిన వస్తువుల కోసం ఖర్చు చేసే స్థోమత పల్లె విద్యార్థులకు లేక పోవడం, ఎలాగో కష్టపడి తెచ్చుకున్నా అరకొర ఇంటర్నెట్తో చదువుకునేందుకు ఇబ్బంది పడినట్టు అనిపిస్తోంది. తాజా ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఈ సందేహా లను లేవనెత్తాయి.

కరోనా లాక్డౌన్ తో..

2020లో కరోనా లాక్డౌన్ పెట్టడంతో సాధా రణ ప్రజలతో పాటు విద్యార్థులూ మారు మూల గ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఆన్ లైన్ బోధన తెరమీది కొచ్చింది. కానీ అప్పటికప్పుడు దాన్ని అందిపు చ్చుకోవడం పల్లె విద్యార్థులకు సాధ్యం కాలేదు. ఆన్ లైన్ విద్యకు ఉపకరణాలు సమకూర్చు కోవడంలో వెనుక బడ్డారు. ఎలాగోలా కష్టపడి తెచ్చుకున్నా అరకొర ఇంటర్నెట్, అంతరా యాలతో ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు కూడా ఆన్ లైన్ కు అంతగా ఆసక్తి చూపలేదు. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవన్నారు. సంక్షేమ హాస్టళ్లను మూసేయడంతో పేద విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. అప్పటికీ ఇంటర్ సిలబస్ 30 శాతం తగ్గించినా గ్రామీణ విద్యార్థులు వేగంగా ముందుకెళ్లలేక పోయారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఎక్కు వుండే సూర్యాపేట, మహబూబాబాద్, వనపర్తి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఇంటర్ ఉత్తీర్ణత 45 శాతం కన్నా తక్కువే నమోదైంది. అరకొరగా పాసైనా వాళ్ల మార్కుల గ్రేడ్ సగటున 50 శాతం దాటలేదు. దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఆన్ లైన్ స్పీడ్ను అందుకోలేదని ఫలితాలను బట్టి తెలుస్తోంది.

పట్టణాలకే పరిమితమైందా?

సాధారణంగా తెలంగాణ లో ఇంటర్ విద్యకు ఎక్కువ మంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలకే ప్రాధాన్యమిస్తున్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు. కరోనా వల్ల ప్రైవేటు కాలేజీల్లో ఆన్ లైన్ విద్యాబోధనకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులూ పట్టణాల్లో ఉండటంతో నెట్ సమస్యలు రాలేదు. ఆ సమయంలో వచ్చిన కొత్త యాప్లూ పట్టణ విద్యార్థులకు ఉపయోగపడ్డాయి. ఫలితంగా పట్టణాల్లో ఉత్తీర్ణత ఎక్కువగా కన్పిస్తోంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్లలో 50 నుంచి 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీళ్లలో ఎక్కువ మంది 75 శాతం మార్కులతో ‘ఏ’ గ్రేడ్ సాధించారు. దీన్ని బట్టి ఆన్ లైన్ విద్య పట్టణాలకే పరిమితమైందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.

చదవండి: 

CAT-2021: క్యాట్‌.. కటాఫ్‌ తగ్గనుందా!

College Fee: ఇంజినీరింగ్ కాలేజీలు మరో 15% ఫీజులు పెంపు !

nglish: నేటి తరానికి ఇంగ్లిష్‌ అవ‌స‌రం.. శిక్షణ కార్యక్రమం ప్రారంభం

Published date : 17 Dec 2021 02:58PM

Photo Stories