సాక్షి, అమరావతి: విద్యార్థులకు ఆన్‌లైన్, దూరవిద్య ప్రోగ్రామ్‌లను అందించడం కోసం వర్సిటీలు ముందుగా University Grants Commission (UGC) అనుమతి తీసుకోవలసిందేనని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆ కోర్సులకు అనుమతి ఉండాల్సిందే : యూజీసీ
యూజీసీ అనుమతితో వర్సిటీలు ఆన్‌లైన్ కోర్సులను, దూరవిద్య విధానంలో ప్రోగ్రామ్‌లను అందించవచ్చని పేర్కొంది. ఆయా కోర్సులు, ప్రోగ్రామ్‌లను ఏ పేరుతో పిలిచినా యూజీసీ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.
‘వర్సిటీలు కమిషన్ ఆమోదంతో, నిబంధనల ప్రకారం షరతులను పూర్తిచేస్తూ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులను అందించవచ్చు. అవి యూజీసీ నోటిఫై చేసిన ఓపెన్, దూరవిద్య మోడ్ నిబంధనల మేరకు అమలు కావాలి’ అని పేర్కొంది.