UGC: వర్సిటీలో బోధనకు అన్ని రంగాలకు చాన్స్
ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కామర్స్, సోష ల్‌సైన్సెస్, మీడియా, సాహిత్యం, ఫైన్‌ఆర్ట్స్, సివిల్ సర్వీసెస్, సైనిక దళాలు, న్యాయ వాద వృత్తి, ప్రజా పాలన వ్యవస్థలో ఉన్నవాళ్లను వర్సిటీల్లో ప్రొఫెసర్లుగా తీసుకోవ చ్చని యూజీసీ పేర్కొంది. వాస్తవానికి ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిని ఆగస్టులోనే ఆమోదించింది. దీన్ని స్పష్టం చేస్తూ అన్ని విశ్వవిద్యాలయాల ఉపకుల పతులకు కమిషన్ లేఖలు రాసింది.
చదవండి: Jobs: యూనివర్సిటీల్లో పేరుకుపోయిన ఖాళీలు.. మెుత్తం పోస్టుల వివరాలు ఇలా..
విశ్వవిద్యాలయాల్లో అవసరమైన బోధన సిబ్బందిలో 10% వివిధ వృత్తుల్లోని నిష్ణాతులను తీసుకునే అవకాశం కల్పించింది. వారికి పార్ట్ టైం వేతనం ఇవ్వాలనే ప్రతిపాదనను తెచ్చింది. ఈ దిశగా ఎంతమందిని.. ఏయే రంగాల నుంచి వారిని తీసుకుంటారనే విషయాన్ని తెలపాలని వర్సిటీలను కోరింది. జాతీయ విద్యావిధానం–2020లో ఇందుకు సంబంధించిన సిఫార్సులను చేర్చారు.