KNRUHS: డెంటల్ యాజమాన్య కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్
జాతీయ స్థాయి అర్హత పరీక్ష NEET–MDS–2022లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లొమా/డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలని పేర్కొంది. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను అక్టోబర్ 18 ఉదయం 8 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు.
చదవండి: KNRUHS: పీజీ డెంటల్ కటాఫ్ మార్కుల తగ్గుదల
దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హతలు, ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inను సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
చదవండి:
NMC: గ్రామాల్లో కుటుంబాలను దత్తత తీసుకోనున్న వైద్య విద్యార్థులు