Dr Komal Kapoor: పరిశోధనలకు ‘నిట్’ వేదికవ్వాలి
నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో నిట్ వరంగల్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 1959 అక్టోబర్ 10వ తేదీన అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాన చేసిన నాటి ఆర్‌ఈసీ.. తన ప్రత్యేకతను చాటుకుంటే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా ఆవిర్భవించడం.. నేడు 65వ వసంతంలోకి అడుగుపెట్టడం అభినందనీయమన్నారు. తాను పని చేస్తున్న హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్.. దేశానికి తోడ్పడుతున్నట్లే నిట్ వరంగల్ విద్యార్థులు తమ పరిశోధనలతో దేశానికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ శ్రీనివాసాచార్య, తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
Yadari Revanth: ఇంజనీరింగ్‌లో గోల్డ్‌మెడల్
88 Lakh salary package: అదరగొట్టిన వరంగల్ నిట్ విద్యార్థి.... 88 లక్షల ప్యాకేజీతో రికార్డు