Skip to main content

Polyfest 2022: నూతన సాంకేతికత తప్పనిసరి

లబ్బీపేట(విజయవాడతూర్పు): పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆధునిక సాంకేతిక అంశాలపై దృష్టి సారించి విభిన్న ప్రయోగాత్మక ప్రాజెక్టులను ఆవిష్కరించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Polyfest 2022
నూతన సాంకేతికత తప్పనిసరి

విజయవాడలో మూడు రోజులు నిర్వహించనున్న పాలిటెక్‌ ఫెస్ట్‌–2022–23ను నవంబర్‌ 24న ఆయన ప్రారంభించారు. బ్లూ టూత్‌ టెక్నాలజీ ద్వారా మంత్రి జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

చదవండి: RGUKT: పాత పద్ధతిలోనే ప్రవేశాలు

‘నవరత్నాలు’, ప్రభుత్వ చర్యల వల్ల విద్యార్థులు ఆటంకాలు లేకుండా తమ చదువును కొనసాగించడమే కాక, త్వరగా ఉపాధి అవకాశాలు పొందగలుగుతున్నారని చెప్పారు. పాలిటెక్నిక్‌ విద్యార్థుల నైపుణ్యాలను నిరంతరం మెరగుపరిచేలా సాంకేతిక విద్యాశాఖ టెక్‌ ఫెస్ట్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Admissions: ఈ విద్యాలయాల్లో సీట్ల కోసం విద్యార్థుల నుంచి పెరిగిన పోటీ

Published date : 25 Nov 2022 05:07PM

Photo Stories