Skip to main content

OU: కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి

ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంపొందించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎంతో మంది నిష్ణాతులు తమ వద్ద సమాచారం ఉన్నా దాన్ని కమ్యూనికేట్‌ చేయలేకపోతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ అన్నారు.
అవార్డు గ్రహీతలతో ఓయూ వీసీ రవీందర్‌
అవార్డు గ్రహీతలతో ఓయూ వీసీ రవీందర్‌
  • ఓయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ 

వరల్డ్‌ కమ్యూనికేటర్స్‌ డే సందర్భంగా పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పలువురు నిష్ణాతులకు సంవాహనా అవార్డులు అందించారు. ముఖ్య అతిథిగా హాజరైన రవీందర్‌ మాట్లాడుతూ... సంస్థ అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు పబ్లిక్‌ రిలేషన్స్‌ పాత్ర ఎంతో ఉంటుందన్నారు. రాజకీయాల్లో కూడా ఎంతో సమాచారం ఉన్నా ఆ సమాచారాన్ని సామాన్య ప్రజలకు చేరవేయడంలో తక్కువమంది విజయం పొందుతారన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిలు ముందజలో ఉంటారన్నారు. సౌత్‌ సంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ సి,హెచ్‌.రాకేష్, కౌన్సిల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కె.రవీంద్రన్, హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్మన్‌ షకీల్‌ అహ్మద్‌లతో ఏడుగురికి సంవాహనా అవార్డులు అందించారు. కార్యక్రమంలో దినేష్, మైఖేల్, నారాయణ్, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.


చదవండి: ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 29 Oct 2021 04:36PM

Photo Stories