NCERT: పాఠ్యపుస్తకాలే అనుసరించాలి
రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు ఎన్‌సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన పాఠ్యాంశాలను కాకుండా వేరే పాఠ్యపుస్తకాలతో బోధనను అనుమతించవద్దని పేర్కొంది. ఇటీవల ఎన్సీఈఆర్టీ జాతీయ స్థాయిలో పాఠ్యాంశాలను పూర్తిస్థాయిలో సవరణ చేసి నూతన జాతీయ పాఠ్యప్రణాళిక ప్రకారం పలు సబ్జెక్టులకు కొత్త పాఠ్యాంశాలతో నూతన పుస్తకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
చదవండి: E-Schools: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఈ–పాఠశాల’.. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యాంశాలు
హేతుబద్ధీకరించిన ఈ కొత్త పాఠ్యాంశాలతో కూడిన ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు అందరికీ అందుబాటులోకి కూడా వచ్చాయి. హేతుబద్ధీకరణ చర్యల్లో భాగంగా పాఠశాల పాఠ్యపుస్తకాల నుంచి ఎన్‌సీఈఆర్టీ మొఘలులు, మహాత్మా గాంధీ, నాథూరామ్ గాడ్సే, గుజరాత్ అల్లర్లు తదితర అంశాలను తొలగించడంతో విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త పాఠ్యపుస్తకాలను మాత్రమే విద్యార్థులకు బోధించాలని ఎన్‌సీపీసీఆర్ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చదవండి: NCERT: ఇకపై గాంధీ, గాడ్సే పాఠాలుండవు... పాఠ్యపుస్తకాల నుంచి తొలగించిన ఎన్‌సీఈఆర్‌టీ.. ఎందుకంటే!