High Court: గ్రామాల్లో వైద్యసేవలు అందించాల్సిందే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యవిద్యార్థులు ఏడాదిపాటు గ్రామాల్లో సేవలందించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టులో నోటిఫికేషన్ ఇవ్వగా తమకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ డాక్టర్ అభినవ్ సింగాలాతోపాటు పలువురు పీజీ విద్యార్థులు కోర్టులో పిటిషన్ వేశారు.
చదవండి: High Court Judges: 554 మంది జడ్జీల్లో 430 మంది జనరల్ కేటగిరీకి చేందినవారే..
దీనిపై జస్టిస్ ముమ్మినేని సుదీర్‌కుమార్ విచారణ చేపట్టారు. వాదనల అనంతరం మెడికల్ సర్వీస్ చేయాల్సిందేనని తీర్పు చెబుతూ పిటిషన్‌ను కొట్టివేశారు.
చదవండి: Telangana High Court : తెలంగాణ హైకోర్టులో అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు
Published date : 04 Feb 2023 02:54PM