Skip to main content

MBBS: ఎంబీబీఎస్ ఫలితాలు విడుదల..రీ టోటలింగ్ చివరి తేదీ ఇదే..

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్‌ పార్ట్‌–1, సెకండియర్‌ ఫలితాలను అక్టోబర్‌ 12న విడుదల చేసింది.
MBBS
ఎంబీబీఎస్‌ ఫలితాలు విడుదల..రీ టోటలింగ్‌ చివరి తేదీ ఇదే..

ఫలితాలపై రీ టోటలింగ్‌ కోరే విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌కు రూ.2,000 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్‌ పార్ట్‌–1 వారు ఈ అక్టోబర్‌ 16వ తేదీ లోపు, ఎంబీబీఎస్‌ సెకండియర్‌ విద్యార్థులు అక్టోబర్‌ 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఫలితాలు యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

బీఎస్సీ నర్సింగ్‌ ఫలితాలు విడుదల..

బీఎస్సీ నర్సింగ్‌ పోస్ట్‌ బేసిక్‌ 2డీసీ, న్యూస్కీమ్‌ 4డీసీ ఫలితాలను డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం అక్టోబర్‌ 12న విడుదల చేసింది. ఈ ఫలితాలపై రీ టోటలింగ్‌ కోరే విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌కు రూ.500 చెల్లించి అక్టోబర్‌ 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

చదవండి: 

ఉద్యోగాలు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

అక్టోబ‌ర్ 29 నుంచి వన్‌టైం చాన్స్‌ డిగ్రీ పరీక్షలు..పూర్తి వివ‌రాలు ఇలా..

Published date : 13 Oct 2021 04:05PM

Photo Stories