UGC: యూజీసీ చైర్మన్‌గా నియమితులైన తెలంగాణ వ్యక్తి?
తెలంగాణా రాష్ట్రం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన ప్రొఫెసర్ మామిడాల జగదీష్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నిపుణులు. ప్రస్తుతం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్‌గా మామిడాల జగదీష్ కుమార్ 2016 జనవరి నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యూజీసీ చైర్మన్‌గా జగదీష్ కుమార్ ఐదు సంవత్సరాలు కొనసాగనున్నారు.
యూజీసీ చైర్మన్‌గా పూణె వర్శిటీ వీసీ డాక్టర్ నితిన్ కర్మల్‌కర్, ఇంటర్ యూనివర్శిటీ యాక్సెలరేటర్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ అవినాష్ పాండే పేర్లతో పాటు మామిడాల జగదీష్‌ను కూడా సెర్చ్ కమిటీ పరిశీలించింది. చివరకు జగదీష్‌కే యూజీసీ చైర్మన్ అవకాశం లభించింది. జేఎన్‌యూ వీసీగా ఉన్న సమయంలో జగదీష్ పలు విమర్శలను ఎదుర్కొన్నారు. క్యాంపస్‌లో కేంద్ర పారా మిలిటరీ బలగాలతో కొంతకాలం భద్రత కల్పించడం, యుద్ధ ట్యాంక్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలాంటివాటిపై విద్యార్థులు ఇప్పటికీ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంటారు.
చదవండి:
12 Thousand Jobs: పోస్టులు భర్తీకి చర్యలు
అంధ విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలు.. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ఒప్పందాలపై సీరియస్..