Kakatiya University: ఎల్‌ఎల్‌ఎం పరీక్ష ఫీజు చెల్లించాలి
Sakshi Education
యూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఎల్‌ఎల్‌ఎం రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక ఒక ప్రకటనలో కోరారు. సెప్టెంబర్ 30 వతేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలన్నారు. రూ 250 అపరాధ రుసుముతో అక్టోబర్ 4వతేదీ వరకు గడువు ఉందన్నారు.
ఎల్‌ఎల్‌బీ మూడు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు
కేయూ పరిధిలో ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల రెండో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్‌ను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు మల్లారెడ్డి, రాధిక తెలిపారు.
రెండో సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 25, 27, 30, అక్టోబర్ 4, 6 వతేదీల్లో జరుగుతాయని తెలిపారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 26, 29, అక్టోబర్ 3, 5, 7వ తేదీల్లో జరుగుతాయని తెలిపారు.
ఐదేళ్ల ‘లా’ కోర్సు రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలు
కేయూ పరిధిలో ఐదేళ్ల ‘లా’ కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 25,27, 30, అక్టోబర్ 4వ తేదీల్లో, నాలుగో సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 26, 29, అక్టోబర్ 3, 5వతేదీల్లో జరుగుతాయి. వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు.
Published date : 22 Sep 2023 03:22PM