2024 Holidays List: 2024లో ఇన్ని సాధారణ సెలవులు.. సెలవుల జాబితా ఇదే..
ఈ మేరకు సాధారణ, ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డిసెంబర్ 12నఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని ఆదివారాలు, అన్ని రెండో శనివారాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసి ఉంచాలని ఆదేశించారు.
2024 జనవరి 1న సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం (ఫిబ్రవరి 10) రోజును పనిదినంగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు.
చదవండి: School Holidays Reduced: విద్యార్థులకు శీతాకాలపు సెలవులు తగ్గింపు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 25 ఐచ్ఛిక సెలవుల్లో గరిష్టంగా 5 సెలవులను మాత్రమే వినియోగించాలని కోరారు. తమ ఇష్టాలకు అనుగుణంగా మతాలతో సంబంధం లేకుండా ఏదైనా పండుగకి సంబంధించిన ఐచ్ఛిక సెలవును ఉద్యోగులు వాడుకోవచ్చని తెలిపారు. అయితే దీనికోసం పైఅధికారికి ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సాధారణ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు వర్తించవని స్పష్టం చేశారు. సంబంధిత సంస్థలే సెలవులపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాయన్నారు.
చదవండి: School Holidays: డిసెంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..
నెలవంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ పర్వదినాల సెలవులను తర్వాత మారుస్తామని తెలిపారు.
2024లో సాధారణ సెలవుల జాబితా..
సందర్భం |
తేదీ |
రోజు |
కొత్త సంవత్సరం |
01–01–2024 |
సోమవారం |
భోగి |
14–01–2024 |
ఆదివారం |
సంక్రాంతి |
15–01–2024 |
సోమవారం |
గణతంత్ర దినోత్సవం |
26–01–2024 |
శుక్రవారం |
మహాశివరాత్రి |
08–03–2024 |
శుక్రవారం |
హోలీ |
25–03–2024 |
సోమవారం |
గుడ్ ఫ్రైడే |
29–03–2024 |
శుక్రవారం |
బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి |
05–04–2024 |
శుక్రవారం |
ఉగాది |
09–04–2024 |
మంగళవారం |
రంజాన్ |
11–04–2024 |
గురువారం |
రంజాన్ తర్వాతి రోజు |
12–04–2024 |
శుక్రవారం |
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి |
14–04–2024 |
ఆదివారం |
శ్రీరామనవమి |
17–04–2024 |
బుధవారం |
బక్రీద్ |
17–06–2024 |
సోమవారం |
షహదత్ ఇమామ్–ఏ–హుస్సేన్ (10వ మొహర్రం) |
17–07–2024 |
బుధవారం |
బోనాలు |
29–07–2024 |
సోమవారం |
స్వాతంత్య్ర దినోత్సవం |
15–08–2024 |
గురువారం |
శ్రీకృష్ణాష్టమి |
26–08–2024 |
సోమవారం |
వినాయక చవితి |
07–09–2024 |
శనివారం |
ఈద్ మిలాద్–ఉన్–నబీ |
16–09–2024 |
సోమవారం |
మహాత్మాగాంధీ జయంతి/ బతుకమ్మ ప్రారంభం రోజు |
02–10–2024 |
బుధవారం |
విజయదశమి |
12–10–2024 |
రెండో శనివారం |
విజయదశమి తర్వాతి రోజు |
13–10–2024 |
ఆదివారం |
దీపావళి |
31–10–2024 |
గురువారం |
కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి |
15–11–2024 |
శుక్రవారం |
క్రిస్మస్ |
25–12–2024 |
బుధవారం |
క్రిస్మస్ తర్వాతి రోజు (బాక్సింగ్ డే) |
26–12–2024 |
గురువారం |