Degree Results: కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల
Sakshi Education
కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మంలో గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, హానర్స్, ఒకేషనల్ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కేయూ వీసీ తాటికొండ రమేశ్, రిజిస్ట్రార్ మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి ఏప్రిల్ 5న విడుదల చేశారు.
డిగ్రీ ఆయా కోర్సుల్లో మొదటి సెమిస్టర్ పరీక్షలో 77,150 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 18,831 మంది (24.41శాతం) ఉత్తీర్ణత సాధించారు. మూడో సెమిస్టర్ పరీక్షలో 59,882 మంది హాజరు కాగా.. 30 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
చదవండి: Psychology Courses: సైకాలజీ కోర్సులతో ఉపాధి అవకాశాలు
ఐదో సెమిస్టర్ పరీక్షల్లో 52,418 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. వారిలో 23,302 మంది (44.45శాతం) ఉత్తీర్ణులయ్యారని కేయూ పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి తెలిపారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌లో చూసుకోవచ్చని తెలి పారు.
కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, డాక్టర్ రాధిక, సీడీసీ డీన్ రాంచంద్రం, క్యాంపు ఆఫీసర్లు ఆసిం ఇక్బాల్, సమ్మయ్య పాల్గొన్నారు.
Published date : 06 Apr 2024 10:50AM